| బ్రహ్మాండమైన తపస్సుచేసికూడ, వరాలు అడిగేటప్పుడు ఉచ్చారణాదోషాలవల్ల | |
| ఆశించిన ఫలితాలు పొందలేకపోయిన మహా రాక్షసుల గురించి మనం విన్నాం. | |
| సరియైన ఉచ్చారణతో శబ్దశక్తినీ, అర్థశక్తినీ కూడ సంపూర్ణంగా పొంది, లబ్ధిపొందగలము. | |
| ఉదాహరణకు : | |
| నూతన దంపతులను గానీ, వివాహిత స్త్రీలను గానీ ఆశీర్వదించేటప్పుడు, | |
| ఒక్క దీర్ఘం ఎంత విపరీతార్థాన్ని ఇస్తుందో చూడండి. | |
| (ఒప్పు )”శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు” – అంటే- త్వరలోనే సుపుత్రుడు కలుగు గాక! | |
| (తప్పు ) “శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు” అంటే - ”సుపుత్ర + అప్రాప్తిరస్తు” అనగా | |
| త్వరలోనే సుపుత్రుడు కలుగకుండు గాక! ఎంతటి అనర్థం! | |
| చక్కగా సంస్కరింపబడిన భాషకు ఒక ముఖ్య లక్షణం : | |
| వ్రాసినదానిని బట్టి చదివితే, ఆ పదం సరిగా ఉచ్చరింపబడాలి; | |
| ఎవరు చదివినా ఒకేరకంగాఉచ్చరింపబడాలి. నాకు తెలిసిన వాటిలో | |
| ఆ సౌలభ్యం సంస్స్కృతానికీ, తెలుగుకూ, హిందీకీ ఉన్నది; ఇంగ్లీషుకూ, తమిళానికీ లేదు. | |
| అయినా తెలుగు ఉచ్చారణలో దోషాలు దొర్లుతూనే ఉన్నాయి! | |
| ముఖ్యమైన కారణం – పాఠశాలలలో నలభైమందిమీద చెప్పుకుపోతూ ఉండటమేగాని, | |
| వ్యక్తిగత దోషాలను సరిచేసే సమయం, అవకాశం ఉండవు గదా. | |
| వ్యక్తిగత శ్రద్ధ ( individual attention ) అనేది తప్పనిసరిగా | |
| తల్లిదండ్రుల ( వారి తల్లిదండ్రుల ) నుంచే రావలసి ఉంటుంది. | |
| పిల్లలయొక్క వాచాదోషాలను సరిచేయాలనిఉన్నా, సాధారణంగా వచ్చే దోషాలు, | |
| ఏది తప్పు, ఏది ఒప్పు అనేది తెలియటం అవసరం కదా ! | |
| తల్లిదండ్రులకూ, ఉపాధ్యాయులకూ సౌకర్యంగా ఉండేందుకు మా దృష్టికి వచ్చిన పదాలను | |
| అప్పుడప్పుడూ ఇదే పేజీలో పొందుపరుస్తూ ఉంటాము. | |
| ఔత్సాహిక మిత్రులుకూడ అట్టి పదాలను ఈ పేజీక్రింద, వారి వ్యాఖ్యల( comments) ద్వారా | |
| అందించ ప్రార్థన ! మొదటగా, భారతీయులలో 80% మందికి పైగా రోజూ చదివే | |
| గురుప్రార్థనా శ్లోకం ” గురుర్బ్రహ్మా…” లో పరిశీలిద్దాము. | |
| ఒప్పు | తప్పు |
| గురుర్‍బ్రహ్మా | గురుబ్రహ్మ ( బ్రహ్మా=సృష్టికర్త, త్రిమూర్తులలో ఒకరు) |
| గురుర్విష్ణు: | గురువిష్ణుః |
| గురుర్దేవో | గురుదేవో (గురుః + దేవో = గురుర్దేవో) |
| మహేశ్వరః | …….. |
| గురుస్సాక్షాత్ | గురుసాక్షాత్ (గురుః + సాక్షాత్ = గురుస్సాక్షాత్. |
| పరంబ్రహ్మ | పరబ్రహ్మా (బ్రహ్మ=త్రిమూర్తులకు మూలమైన పరమాత్మ) |
| తస్మై శ్రీ | ………… |
| గురవే నమః | గురువే న్నమః (‘న’ క్రింద ’ న ‘వత్తు ఉండరాదు) |
| * * * * * * * * * * * * * | |
| NOTE: Please click on the title “TELUGU BHARATHI “ | |
| at the top of this page, to get a full view of the side-bar. | |
| Then you may click on the name of the required page ; | |
| or on a sister blog in the blog-roll, in the side-bar; to | |
| find related topics of interest. | |