‘(1100) భారతీయ సంస్కృతి’ అనే వర్గంలోని టపాలు

ఉగాది సంకల్పాలు (27/03/09)

మార్చి 27, 2009

ఉగాది శుభాకాంక్షలు !
స్వస్తిశ్రీ చాంద్రమాన విరోధి నామ నూతన సంవత్సరంలో,
సకల వైరుద్ధ్యాలూ సమసిపోయి, శాంతి అభ్యుదయాలు
అందరికీ అందాలని మా శుభాకాంక్షలు !

తెలుగు వారిగా, మన ప్రత్యేక పండుగ ఉగాదినాడు,
ఈ నూతన సంవత్సరానికై, కొన్ని ముఖ్యమైన సంకల్పాలు చెప్పుకుందాము.

వీటివల్ల మన, మన పిల్లల ఇంగ్లీషు పరిజ్ఞానానికీ, ఉద్యోగార్జనలకీ ఏమాత్రమూ భంగం రాదు.
పైగా, మనం కూడా మాతృభాష, సంస్కృతీ సంప్రదాయాలతో అనుబంధం కలిగే ఉన్నామన్న ఆత్మ సంతృప్తి మనకూ కలుగుతుంది ! మాతృభాష వలన సృజనాత్మకత ( Creative Thinking Faculty ) కూడ గరిష్ఠంగా వికసిస్తుంది !

౧) మన పండగల శుభాకాంక్షలను, ప్రత్యాకాంక్షలను మనకు చేతనయిన తెలుగులోనే హృదయపూర్వకంగా తెలుపుకుందాము.
( instead of the mechanical ” HAPPY…” and ” SAME TO YOU” type)

౨) ఎదుటి వ్యక్తికి తెలుగు అర్థం అవుతుందని తెలిస్తే చాలు, తెలుగులోనే మాట్లాడుదాం.

౩)” మా పిల్లకు/పిల్లవాడికి తెలుగు ( సరిగా ) రాదు “
అని ముద్దుముద్దుగా, గర్వంగా చెప్పుకునే దుఃస్థితి
మళ్ళీ వచ్చే ఉగాది నాటికి మనకు ఉండకూడదు.సంకల్పబలంతో

ప్రారంభిస్తే, ఒక సంవత్సర కాలం చాలా ఎక్కువే !

౪)ప్రతి తెలుగు విద్యార్థికి, హైస్కూల్ వదిలేనాటికి కనీసంకొన్ని పద్యాలు, కొన్ని సూక్తులైనా, వేమన, పోతన, భగవద్ గీత మొ. వాటి నుంచి వచ్చి ఉండాలి.

౫) వచ్చే ఉగాదికి మన కుటుంబంలోని ప్రతిఒక్కరిలోనూ  తెలుగుదనంస్థాయిలో

చెప్పుకోదగినంత అభివృద్ధి రావాలి.

( ఈ లక్ష్యసాధనలో మీకు అత్యంత ఉపయోగంగా ఉంటాయి- మా అన్బంధ బ్లాగు kamthasthabharathi.wordpress.com బ్లాగులోని

పేజీలు – వేమన సూక్తులు, భగవద్ గీతాసూక్తులు, శతక సారం  మొదలైనవి.)