‘(02) తపన’ అనే వర్గంలోని టపాలు

T.V. ఛానెళ్ళు (తపన)

జనవరి 23, 2008
T.V. CHANNELS: ( బాధాకర అంశాలు):
  1. ధ్వని తారతమ్యం:   డైలాగులకీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీ, అడ్వర్ టైజ్ మెంట్లకీ మధ్య sound levels లో విపరీతమైన తేడాలు ! రిమోట్ వాడేలోపలే ధ్వని ప్రభావం పడుతోంది. అనుక్షణం రిమోట్ మీద వ్రేళ్ళు, చిరాకు, తలనొప్పి ! లక్షలాది ప్రజల (వినియోగదారుల) ఆరోగ్యం, సౌకర్యాల దృష్ట్యా- ఈ sound-level difference ని 10% కి మించకుండా ఛానెళ్ళను నియంత్రించే విధానం ఏమిటి?  ప్రయత్నం చేసే ఆసక్తి గలవారు ఎవరైనా ముందుకు వస్తారా?
  2. ప్రజల సమయం వృధా :   అరగంట కార్యక్రమంలో నికరంగా చూపేది 15 నిమిషాలు మాత్రమే! పూర్తి నిదివి Title-songs మొదట్లో చివర్లో,  Recap, Preview, విసుగు కలిగించేటంత తఱచుగా breaks & advertisements, మొ|| ఎన్నో!  ప్రోగ్రాం నికరంగా చూపించే సమయానికీ, అంతరాయాల క్రింద వెచ్చించే సమయానికీ మధ్య ఒక healthy proportion ఉండవలసిన అవసరం లేదా? ఒక అరగంట ప్రోగ్రాం లో ఒక advertisement 2 లేక 3 సార్లు మాత్రమే వస్తే భరించవచ్చు. ప్రకటనల  ఆదాయం కోసం  వినియోగదారులను మరీ ఇంత క్షోభ పెట్టడం న్యాయమేనా?
  3. తెలుగు భాషా ద్రోహం:      ఉచ్చారణ అధ్వాన్నం! “బారత దేశం”, “బక్తి”,వంటి ఒత్తులు లేని తెలుగు! “జెమిని” వంటి తమిళ ఛానెళ్ళే కాకుండా, తెలుగువారి స్వంత ఛానెళ్ళు కూడా అలాగే!  తెలుగును తెలుగుసంప్రదాయబధ్ధంగా ఉచ్చరించ గలగటం అనేది T.V.dubbing artists యొక్క selection లో కనీసార్హత కాదా? ఒక తెలుగు ప్రోగ్రాం ని తమిళం లోకి dubbing చేసి ఉచ్చారణా దోషాలతో విడుదల చేసి చూడమనండి!
  4. Cinemas  నియంత్రణకి Censor Board ఉన్న మాదిరిగా, T.V.Channels కి మార్గదర్శక సూత్రాలు రూపొందించడం, వాటిని నియంత్రించేందుకు ఒక సంస్థ ఉన్నదా? దానితో సంబంధం (liaison) పెట్టుకోవడానికి ’తపన’ గలవారు  ఎవరైనా ముందుకు వస్తారా! స్వాగతం!
  5. NOTE:  Your responses can be in English too, if it suits you.

ఎంట్రీని మార్చు.

“తపన”

జనవరి 20, 2008

   స్వాగతం !

  • మనం ముందు “భారతీయులం”, తరువాతే “ఆంధ్రులం”
  • భారతీయుల, ప్రత్యేకించి ఆంధ్రుల జీవితాలలో పలు రంగాలలో వస్తున్న మార్పులు, విలువల పతనం (value degradation) మనలో చాలా మందికి “తపన” కలిగిస్తూనే ఉన్నాయి.
  • విలువల పరిరక్షణ అనేది దేశం కోసమో ఎవరి కోసమో కాదు. పాటించే వారి సుఖసంతోషాలు, ఆత్మ గౌరవం పెరగ డానికే !
  • మన తపన గురించి సాటి వారితో పంచుకోవాలనే తపనే ఈ ప్రయత్నం !
  • ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే !
  • సద్విమర్శయే కాకుండా పరిష్కారానికై మనకు తోచిన సూచనలు కూడా చేద్దాం.
  • మనలో చాలామంది యువకులు, ఉత్సాహ వంతులు, కార్యశూరులు ఉన్నారు. తమ అభిమాన రంగాలలో వచ్చిన నచ్చిన సూచనలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తూ, ఫలితాలు నలుగురికీ తెలియ జేద్దాం.
  • ఏ రంగమైనా మంచిదే. కొన్ని ప్రాధాన్యతా రంగాలు : ఆహారం, ఆరోగ్యం, వైద్యం, ప్రాథమిక విద్య, సంస్కృతీ స్థూల అవగాహన, విశాల దృక్పథం, మానవతా వాదం, కుటుంబానందం, మాతృదేశాభిమానం, మాతృభాషా సంస్కృతీ సాహిత్యాలు, స్త్రీల మనోభావాలు, విద్యా వైద్య రాజకీయ రంగాలలోని భ్రష్ట వ్యాపార ధోరణులు….
  • కాదేదీ  ” తపన ” కనర్హం !      

ఎంట్రీని మార్చు.