నవంబరు, 2008 నెల టపాలు

తెలుగు భాష – అసలు సమస్య

నవంబరు 29, 2008

 

శ్రీరామ
                  తెలుగు భాష – అసలు సమస్య                    
   
                                ( BACK TO BASICS )
సహచర బ్లాగరులారా ! మీరు సహకరిస్తే – మనలో విజ్ఞులు, ఔత్సాహికులంతా కలిసి -  
ఒక నిర్మాణాత్మక, మార్గదర్శక చర్చకు తెర తీద్దాం !   భాషావేత్తలు, పండితులు, 
రాజకీయవేత్తలు, ఆంధ్ర ప్రభుత్వమూ  చేస్తున్న  నేల విడిచిన సాములా కాకుండా, -
 గుండెలనిండా మాతృభాషాభిమానం, తెలుగును తరతరాలకూ – తెలుగువారి అందరి 
నాలుకలపై – సజీవంగా, చైతన్యవంతంగా ఉంచాలనే తపన కలిగిన వారందరికీ,
  ఒక User – friendly, down-to-earth practicable, self-reliant Approach &
 Plan of Actionల మీద Guidance అందించగలం !
అసలు భాషవల్ల కలగవలసిన ప్రయోజనాలను దృష్టిలో నుంచుకుంటే, మూలాలనుంచీ 
ఆలోచించుకుంటూ వస్తే, సమస్య యొక్క విశ్లేషణ సులువు అవుతుంది, మంచి 
పరిష్కారాలూ  దొరుకుతాయి.
నా అభ్యర్థనా, సూచనలూ, ప్రణాళికా  ఏమంటే : –
(1) మొత్తం విషయాన్ని 15 అంశాలుగా విభజిద్దాము.
(2) ఎవరికి ఏ అంశాలలో ఆసక్తి, అభిరుచి, ప్రవేశమూ ఉంటే, వారు ఆ విషయాలలో 
     వ్రాయవచ్చు.
(3) ఎవరి బ్లాగులో వారు చిన్నదో పెద్దదో వ్యాసంలా వ్రాయవచ్చు; లేదా ఈ Post క్రింద 
     వ్యాఖ్యల రూపంలో నైనా వ్రాయవచ్చు.
(4) ఆన్నిటినీ ఒకేచోట చదువుకునే అవకాశం కల్పించటం కోసం – మనం – పైన యిచ్చిన 
     శీర్షిక ” తెలుగు భాష – అసలు సమస్య ” అనే దాన్నీ,  ఈ క్రింద ఇచ్చిన    15 అంశాలనీ 
      కూడా – మొత్తం 16 అంశాలనీ  TAGS గా పరిగణిద్దాము.
(5) ఒక పోష్టును ఒక అంశానికే పరిమితం చేస్తూ, దానికి TAG క్రింద _ పై శీర్షికనూ, మరియూ
     ఆ అంశం పేరునూ – రెండిటినీ కూడా యథాతథంగా ఇచ్చుకుందాము.
(6) అప్పుడు అందరికీ ఒకే Thought -Data-Bank ఏర్పడుతుంది ! ఒకరి విజ్ఞానం, 
     అనుభవసారం అందరికీ అందుతాయి !  Communication Skills కి కావలసిన 
      basics  అన్నీ అందుతాయి !
ఇవిగో ఆ పంచదశ అంశాలు !  : 
1 భాష – ఆవశ్యకత, ప్రయోజనాలు
2 మంచి భాష – లక్షణాలు
3 సంస్కృత భాష – వైశిష్ట్యం
4 భిన్న భాషలు – వికాసం
5 మాతృభాష – ప్రాశస్త్యం
6 మన తెలుగు భాష  -  తియ్యదనం, గొప్పదనం
7 హిందీ భాష – ప్రత్యేకతలు
8 ఇంగ్లీషు భాష – లక్షణాలు
9 ఇంగ్లీషు మీడియం – ఆవశ్యకత, ప్రయోజనం, లాభనష్టాలు
10 భాష – వ్యక్తిత్వ వికాసం, మానవీయ ప్రవర్తన 
11 భాష -  జాతి గౌరవ ప్రతిష్ఠలు నిలపటం
12 భాష – సంస్కృతీ పరిరక్షణ ( భావితరాలకై )
13 తెలుగు వారు – మాతృభాషాభిమానం 
14 తెలుగు భాష – అవాంతర భేదాలు 
15 తెలుగు భాష – అభివృద్ధికి సూచనలు 
ప్రారంభిద్దామా మరి !
   

ఉచ్చారణ సరిగా ఉంటే – అద్భుత ఫలితం !

నవంబరు 15, 2008
   
   
బ్రహ్మాండమైన తపస్సుచేసికూడ, వరాలు అడిగేటప్పుడు ఉచ్చారణాదోషాలవల్ల
 ఆశించిన ఫలితాలు పొందలేకపోయిన మహా రాక్షసుల గురించి మనం విన్నాం.
సరియైన ఉచ్చారణతో శబ్దశక్తినీ, అర్థశక్తినీ కూడ సంపూర్ణంగా పొంది, లబ్ధిపొందగలము.
ఉదాహరణకు :
నూతన దంపతులను గానీ, వివాహిత స్త్రీలను గానీ ఆశీర్వదించేటప్పుడు,
ఒక్క దీర్ఘం ఎంత విపరీతార్థాన్ని ఇస్తుందో చూడండి.
(ఒప్పు )”శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు” – అంటే- త్వరలోనే సుపుత్రుడు కలుగు గాక!
(తప్పు ) “శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు” అంటే - ”సుపుత్ర + అప్రాప్తిరస్తు” అనగా
 త్వరలోనే సుపుత్రుడు కలుగకుండు గాక!   ఎంతటి అనర్థం!
చక్కగా సంస్కరింపబడిన భాషకు ఒక ముఖ్య లక్షణం :
వ్రాసినదానిని బట్టి చదివితే, ఆ పదం సరిగా ఉచ్చరింపబడాలి;
ఎవరు చదివినా ఒకేరకంగాఉచ్చరింపబడాలి. నాకు తెలిసిన వాటిలో
ఆ సౌలభ్యం సంస్స్కృతానికీ, తెలుగుకూ, హిందీకీ ఉన్నది; ఇంగ్లీషుకూ, తమిళానికీ లేదు.
అయినా తెలుగు ఉచ్చారణలో దోషాలు దొర్లుతూనే ఉన్నాయి!
ముఖ్యమైన కారణం – పాఠశాలలలో నలభైమందిమీద చెప్పుకుపోతూ ఉండటమేగాని,
 వ్యక్తిగత దోషాలను సరిచేసే సమయం, అవకాశం ఉండవు గదా.
 వ్యక్తిగత శ్రద్ధ ( individual attention ) అనేది తప్పనిసరిగా
 తల్లిదండ్రుల ( వారి తల్లిదండ్రుల ) నుంచే రావలసి ఉంటుంది.
పిల్లలయొక్క వాచాదోషాలను సరిచేయాలనిఉన్నా, సాధారణంగా వచ్చే దోషాలు,
 ఏది తప్పు, ఏది ఒప్పు అనేది తెలియటం అవసరం కదా !
తల్లిదండ్రులకూ, ఉపాధ్యాయులకూ సౌకర్యంగా ఉండేందుకు మా దృష్టికి వచ్చిన పదాలను
 అప్పుడప్పుడూ ఇదే పేజీలో పొందుపరుస్తూ ఉంటాము.
ఔత్సాహిక మిత్రులుకూడ అట్టి పదాలను ఈ పేజీక్రింద, వారి వ్యాఖ్యల( comments) ద్వారా
 అందించ ప్రార్థన ! మొదటగా, భారతీయులలో 80% మందికి పైగా రోజూ చదివే
గురుప్రార్థనా శ్లోకం ” గురుర్బ్రహ్మా…” లో పరిశీలిద్దాము.
ఒప్పు తప్పు
గురుర్‍బ్రహ్మా గురుబ్రహ్మ ( బ్రహ్మా=సృష్టికర్త, త్రిమూర్తులలో ఒకరు)
గురుర్విష్ణు:  గురువిష్ణుః
గురుర్దేవో గురుదేవో  (గురుః + దేవో = గురుర్దేవో)
మహేశ్వరః ……..
గురుస్సాక్షాత్ గురుసాక్షాత్  (గురుః + సాక్షాత్ = గురుస్సాక్షాత్.
పరంబ్రహ్మ పరబ్రహ్మా (బ్రహ్మ=త్రిమూర్తులకు మూలమైన పరమాత్మ)
తస్మై శ్రీ …………
గురవే నమః  గురువే న్నమః (‘న’ క్రింద ’ న ‘వత్తు ఉండరాదు)
    
* * * * * * * * * * * * *
NOTE: Please click on the title “TELUGU BHARATHI “
at the top of this page, to get a full view of the side-bar.
Then you may click on the name of the required page ;
or on a sister blog in the blog-roll, in the side-bar; to
find related topics of interest.