స్వాగతం !
-
మనం ముందు “భారతీయులం”, తరువాతే “ఆంధ్రులం”
-
భారతీయుల, ప్రత్యేకించి ఆంధ్రుల జీవితాలలో పలు రంగాలలో వస్తున్న మార్పులు, విలువల పతనం (value degradation) మనలో చాలా మందికి “తపన” కలిగిస్తూనే ఉన్నాయి.
-
విలువల పరిరక్షణ అనేది దేశం కోసమో ఎవరి కోసమో కాదు. పాటించే వారి సుఖసంతోషాలు, ఆత్మ గౌరవం పెరగ డానికే !
-
మన తపన గురించి సాటి వారితో పంచుకోవాలనే తపనే ఈ ప్రయత్నం !
-
ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే !
-
సద్విమర్శయే కాకుండా పరిష్కారానికై మనకు తోచిన సూచనలు కూడా చేద్దాం.
-
మనలో చాలామంది యువకులు, ఉత్సాహ వంతులు, కార్యశూరులు ఉన్నారు. తమ అభిమాన రంగాలలో వచ్చిన నచ్చిన సూచనలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తూ, ఫలితాలు నలుగురికీ తెలియ జేద్దాం.
-
ఏ రంగమైనా మంచిదే. కొన్ని ప్రాధాన్యతా రంగాలు : ఆహారం, ఆరోగ్యం, వైద్యం, ప్రాథమిక విద్య, సంస్కృతీ స్థూల అవగాహన, విశాల దృక్పథం, మానవతా వాదం, కుటుంబానందం, మాతృదేశాభిమానం, మాతృభాషా సంస్కృతీ సాహిత్యాలు, స్త్రీల మనోభావాలు, విద్యా వైద్య రాజకీయ రంగాలలోని భ్రష్ట వ్యాపార ధోరణులు….
-
కాదేదీ ” తపన ” కనర్హం !
టాగులు: క్షాళన, తపన, ధోరణులు, విమర్శ, విలువల పతనం