(1101D) పోతన భాగవత సారం – 1 వ స్కంధం
| పోతన భాగవతం ( 1 వ స్కంధ సారం ) | ||||||||||||||
| *********************************** | ||||||||||||||
| పోతన భాగవతం ప్రథమస్కంథం లోనుండి, పిల్లలనుంచి కర్మాసక్తులు, | ||||||||||||||
| ధర్మాసక్తులైన పెద్దల వరకు ఉపయుక్తమైన భావాలు, మధుర | ||||||||||||||
| సుందరమైన పద్యాలను చాలాభాగం సేకరించి, మీకందిస్తున్నాం. | ||||||||||||||
| పిల్లలకు ( IX, X తరగతుల వయస్సు వరకు ) తెలియటం | ||||||||||||||
| చాలా మంచిది అనిపించిన వాటిని ఈ బ్లాగుకు అనుబంధ బ్లాగు | ||||||||||||||
| అయిన ” కంఠస్థ భారతి ” లో ఇవ్వటం జరిగింది. ఆ పైస్థాయి | ||||||||||||||
| విషయాలను జిజ్ఞాసువుల సౌకర్యార్థం ఈ పేజీలో ఇస్తున్నాము. | ||||||||||||||
| భక్తి, జ్ఞాన సాధకులు ఎలాగూ భాగవతం సంపూర్ణంగా | ||||||||||||||
| చదవాల్సిందే ! పోతన భాగవత మకరందాన్ని రుచి చూపింటంద్వారా | ||||||||||||||
| పిల్లలలో ఆ కవి, ఆ గ్రంథం పట్ల ఒక గౌరవభావాన్నీ, సుముఖతనూ, | ||||||||||||||
| పెద్దయ్యాక అవకాశం దొరికినప్పుడు శ్రవణ, పఠనాసక్తినీ కలిగించటమే | ||||||||||||||
| ఈ ప్రయత్నం లోని ముఖ్య ఉద్దేశ్యం. | ||||||||||||||
| *************************************** | ||||||||||||||
| విషయం | ఛందస్సు | |||||||||||||
| పద్యసంఖ్య | సందర్భం | |||||||||||||
| 1- అధ్యా | ||||||||||||||
| లోకరీతి | ||||||||||||||
| 1 | 601 | 226/1 | మ. | ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కక్కడై తోచు పోలికన్, | ||||||||||
| ( ఏ దేవుడు ) | ||||||||||||||
| 2 | 601 | 231< | వ | దివావసానంబున విహంగంబు బారకయుండు తెఱంగున | ||||||||||
| 3 | 601 | 442/4 | ఉ. | … మరందము | ||||||||||
| ల్లాసము తోడ గ్రోలి విరులం దెగజూడని తేటి కైవడిన్. | ||||||||||||||
| 4 | 601 | 452/1,4 | క్రమమున మింటికై యెగయు గాక విహంగము మింటిదైన పా | |||||||||||
| రము గన నేర్చునె? ……………………నాదు చి | ||||||||||||||
| త్తమునకు నెంత గానబడె దప్పక చెప్పెద మీకు నంతయున్ | ||||||||||||||
| 5 | 602 | 203 | వ. | మద్యంబున మద్యభాండంబునకు శుద్ధి సంభవింపని చందంబున, | ||||||||||
| బుద్ధిపూర్వక జీవహింసంబు …చేతం, పాపబాహుళ్యంబుకాని | ||||||||||||||
| పాపనిర్ముక్తి గాదని శంకించెద.. | ||||||||||||||
| 6 | 604 | 487/1 | క. | చెలగరు కలగరు సాధులు | ||||||||||
| మిళితములయి పరుల వలన మేలుం గీడున్ ! | ||||||||||||||
| 7 | రాజ-ప్రజ | ( ధర్మరాజు రాజ్యంలో ) | ||||||||||||
| 8 | 607 | 232/ . | ఆ | రోగాది భయములు సెందవు ప్రజల కెందు | ||||||||||
| 9 | 607 | 482/1,2 | ఉ. | కాపరి లేని గొఱ్ఱియల కైవడి గంటకచోర కోటిచే | ||||||||||
| నేపఱి యున్నదీ భువన మీశుడు కృష్ణుడు లేమి, నిట్టిచో | ||||||||||||||
| ( రాజధర్మం ( పరీక్షిత్తు -కలితో ) | ||||||||||||||
| 10 | 607 | 416/3,4 | క. | …మదమత్తుడవై | ||||||||||
| దండింపదగని వారల | ||||||||||||||
| దండించెదు; నీవ తగుదు దండనమునకున్ ! | ||||||||||||||
| ( రాజధర్మం-అరాచకం – శమీకముని శృంగితో ) | ||||||||||||||
| 11 | 607 | 483 . | సీఆ | పాపంబు నీచేత బ్రాపించె మన | ||||||||||
| కింక, రాజు నశించిన రాజ్యమందు | ||||||||||||||
| బలవంతుడగువాడు బలహీను పశు | ||||||||||||||
| దార హయ సువర్ణాదుల నపహరించు; | ||||||||||||||
| జార చోరాదులు సంచరింతురు; ప్రజ | ||||||||||||||
| కన్యోన్య కలహంబు లతిశయిల్లు; | ||||||||||||||
| వైదికంబై యున్న వర్ణాశ్రమాచార | ||||||||||||||
| ధర్మ మించుక లేక తప్పిపోవు; | ||||||||||||||
| నంతమీద లోకు లర్థకామంబుల | ||||||||||||||
| దగిలి సంచరింప ధరణి నెల్ల | ||||||||||||||
| వర్ణసంకరములు వచ్చును మర్కట | ||||||||||||||
| సారమేయ కులము మేర బుత్త్ర ! | ||||||||||||||
| ( లోకరీతి – మానవ సామాన్యం; ( విదురుడు-ధర్మజునికి ) | ||||||||||||||
| 12 | 609 | 306/1,2. | ఆ | మేలు సెప్పెనేని మేలండ్రు లోకులు, | ||||||||||
| చెట్ట యండ్రు కీడు చెప్పెనేని | ||||||||||||||
| నంతమీద శూద్రుడైన కతంబున | ||||||||||||||
| శిష్టమరణ మతడు సెప్పడయ్యె! | ||||||||||||||
| దృక్పథం | ||||||||||||||
| 13 | 705 | 20/4 | అందర మెప్పింతు గృతుల నయ్యైయెడలన్ . | |||||||||||
| ( దుఃఖకారణం ( ధర్మ- వృషభం పరీక్షిత్తుతో ) | ||||||||||||||
| 14 | 705 | 427 | వ. | పరులవలన దుఃఖంబు వచ్చిన, నధర్మంబు పరులు సేసిరని | ||||||||||
| విచారింపవలదు; తర్కింపను నిర్దేశింపను రాని | ||||||||||||||
| పరమేశ్వరుని వలన సర్వంబు నగుచుండును. | ||||||||||||||
| 15 | 705 | 428/3,4 | క. | పాపకర్ములు చేయు పాపంబు సూచింప, | ||||||||||
| పాపకర్ము డేగు పథము వచ్చు! | ||||||||||||||
| ప్రవర్తన | ||||||||||||||
| 16 | 800 | 408 | ఉ | ఆ మధురోక్తు లానయము లాదరహాసము లాదయారసం | ||||||||||
| బామురిపంబు లాతగవు లాగమనక్రియ లామనోహర | ||||||||||||||
| ప్రేమకరావలోకనము ప్రీతి గనుంగొనలేమి మాధవుం | ||||||||||||||
| గామినులేల? నిర్దళితకర్ములు యోగులు బాయనేర్తురే! | ||||||||||||||
| ( వ్యవహార నీతి ) | ||||||||||||||
| 17 | 805 | 382 | వ | కంటకంబునం గంటకోన్మూలనంబు సేసి, కంటకంబులు రెంటిని | ||||||||||
| పరిహరించు విన్నాణి తెఱంగున | ||||||||||||||
| సంభాషణ | ||||||||||||||
| 18 | 807 | 258 | క. | ( చెచ్చెర గరినగరికి ) నీ | ||||||||||
| విచ్చేసిన నిమిషమైన వేయేండ్లగు నీ | ||||||||||||||
| వెచ్చోటికి విచ్చేయక | ||||||||||||||
| మచ్చికతో నుండుమయ్య మా నగరమునన్ | ||||||||||||||
| 19 | 807 | 259/1,2 | ఆ | అంధకారవైరి యపరాద్రికవ్వలం | ||||||||||
| జనిన నంధమయిన జగముభంగి | ||||||||||||||
| ( సంభాషణ ( ధర్మరాజు – విదురునితో ) | ||||||||||||||
| 20 | 807 | 301 | తే. | వేఱు తీర్థంబు లవనిపై వెదకనేల? | ||||||||||
| మిమ్ము బొడగని భాషించు మేల చాలు… | ||||||||||||||
| వార్త లేమండ్రు లోకులు వసుధలోన | ||||||||||||||
| మీకు సర్వంబు నెఱిగెడి మేధ గలదు! | ||||||||||||||
| ( వినయము ( పరీక్షిత్తు – మునులతో ) | ||||||||||||||
| 21 | 807 | 500/3,4 | …ఉత్తము లయ్యలార! నా | |||||||||||
| పాపమువాయు మార్గము | ||||||||||||||
| గృపాపరులార! విధించి చెప్పరే ! | ||||||||||||||
| ధర్మం | ( లోకక్షేమం ( ధర్మదేవత – పరీక్షిత్తుతో ) | |||||||||||||
| 22 | 1010 | 427 | వ. | యేము ( = మేము అనగా ధర్మదేవత, భూదేవతలం ) | ||||||||||
| ప్రాణులకు దుఃఖహేతువులం గాము; | ||||||||||||||
| మా వలన దుఃఖంబు నొందెడు పురుషుండు లేడు. | ||||||||||||||
| ( తాపసి ధర్మం – శమీక మహర్షి గురించి ) | ||||||||||||||
| 23 | 1011 | 458 | సీతే | మెలగుట చాలించి మీలిత నేత్రుడై | ||||||||||
| శాంతుడై కూర్చుండి జడత లేక | ||||||||||||||
| ప్రాణమనోబుద్ధి పంచేంద్రియంబుల | ||||||||||||||
| బహిరంగవీధుల బాఱనీక | ||||||||||||||
| జాగరణాదిక స్థానత్రయము దాటి | ||||||||||||||
| పరమమై యుండెడి పదము దెలిసి | ||||||||||||||
| బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియుండయి | ||||||||||||||
| యతి, దీర్ఘజటలు దన్నావరింప | ||||||||||||||
| నలఘు రురు చర్మధారియై యలరుచున్న | ||||||||||||||
| తపసి బొడగని ( శోషిత తాలుడగుచు | ||||||||||||||
| నెండి తడి లేక కుత్తుక నెలుంగు డింద, | ||||||||||||||
| మందభాషల నిట్లను మనుజ విభుడు. ) | ||||||||||||||
| స్త్రీలు | ||||||||||||||
| ( స్త్రీత్వ పరాకాష్ట – భూదేవి ధర్మదేవతతో ) | ||||||||||||||
| 24 | 1384 | 1–409 | క. | మెల్లన నాపై యాదవ | ||||||||||
| వల్లభు డడుగిడగ మోహ-వశనై నే రం | ||||||||||||||
| జిల్లగ రోమాంచము క్రియ | ||||||||||||||
| మొల్లములై మొలచు సస్య-ములు మార్గములన్. | ||||||||||||||
| ( స్త్రీలు- భర్త గ్రామంలో లేని రోజులలో ) | ||||||||||||||
| 25 | 1384 | 1–269 | వ. | వారలు హరిం బాసిన దినంబులందు శరీరసంస్కార, | ||||||||||
| కేళీవిహార, హాస, వనమందిర గమన, | ||||||||||||||
| మహోత్సవ దర్శంబు, లొల్లని యిల్లాండ్రు కావున | ||||||||||||||
| ( గర్భరక్షణ ప్రార్థన – (ఉత్తర-శ్రీకృష్ణునితో ) | ||||||||||||||
| 26 | 1385 | 181 | ఆ. | గర్భమందు గమలగర్భాండ శతములు | ||||||||||
| నిముడుకొన వహించు నీశ్వరేశ ! | ||||||||||||||
| నీకు నొక్క మానవీ గర్భరక్షణ | ||||||||||||||
| మెంత బరువు నిర్వహింతు గాక ! | ||||||||||||||
| ( కమలగర్భాండం = బ్రహ్మాండం ) | ||||||||||||||
| ( స్త్రీలు-యోగక్షేమాలు ) | ||||||||||||||
| 27 | 1387 | 267 | మ | కొడుకుల్ భక్తివిధేయు లౌదురు గదా? కోడండ్రు మీ వాక్యముల్ | ||||||||||
| గడవంజాలక యుందురా! విబుధ సత్కారంబు గావింతురా? | ||||||||||||||
| తొడవుల్ వస్త్రములుం బదార్థ రస సందోహంబులున్ జాలునా? | ||||||||||||||
| కడమల్ గావుగదా, భవన్నిలయముల్ గల్యాణయుక్తంబులే? | ||||||||||||||
| కాలము | ||||||||||||||
| 28 | 1400 | 210 | ఉ | వాయువశములై యెగసి వారిధరంబులు మింటగూడుచుం | ||||||||||
| బాయుచునుండు కైవడి బ్రపంచము సర్వము గాలతంత్రమై | ||||||||||||||
| పాయుచు గూడుచుండు నొకభంగి చరింపదు కాలమన్నియుం | ||||||||||||||
| జేయుచునుండు గాలము విచిత్రము దుస్తర మెట్టివారికిన్ | ||||||||||||||
| ( కాలము ( సూతుడు – శౌనకునితో ) | ||||||||||||||
| 29 | 1400 | 308 . | క | బాలాజన, శాలా, ధన, | ||||||||||
| లీలావనముఖ్య విభవలీన మనీషా | ||||||||||||||
| లాలసులగు మానవులను | ||||||||||||||
| గాలము వంచించు, దురవగాహము సుమతీ! | ||||||||||||||
| కలికాలం | ( ధర్మజుడు – భీమునితొ) ( కృష్ణ- నిర్యాణ సమయ దుర్నిమిత్తాలు ) | |||||||||||||
| 30 | 1401 | 332/3,4 | సీతే | సఖ్యంబు వంచనా సహిత మండ్రు | ||||||||||
| మగలతో నిల్లాండ్రు మచ్చరించెద రండ్రు | ||||||||||||||
| సుతులు తండ్రుల దెగజూతు రండ్రు | ||||||||||||||
| గురుల శిష్యులు దూషించి కూడ రండ్రు | ||||||||||||||
| శాస్త్రమార్గము లెవ్వియు జరుగ వండ్రు | ||||||||||||||
| న్యాయపద్ధతి బుధులైన నడవ రండ్రు | ||||||||||||||
| కాలగతి వింతయై వచ్చె గంటె నేడు ! | ||||||||||||||
| ( కలికాలం - కృష్ణనిర్యాణానంతరం ధర్మవృషభం | ||||||||||||||
| భూదేవితో – ఎందుకు తల్లీ! విచారంగా ఉన్నావు? అంటూ..) | ||||||||||||||
| 31 | 1401 | 1–396 | సీ | రమణులు రమణుల రక్షింపరనియొ? | ||||||||||
| పుత్త్రులు తల్లిదండ్రుల బ్రోవరనియొ? | ||||||||||||||
| భారతి కుజనుల బ్రాపించుననియొ? | ||||||||||||||
| సద్విప్రులు నృపుల సేవింతురనియొ?… | ||||||||||||||
| మనుజు లన్నపాన మైథున శయనాస | ||||||||||||||
| నాది కర్మసక్తు లగుదురనియొ? | ||||||||||||||
| ( కలిలోని అధర్మాలు – పరీక్షిత్తు కలితో ) | ||||||||||||||
| 32 | 1401 | 434 | వ | రాజదేహంబునందు వర్తించు నిన్ను ( = కలిని ) అసత్య లోభ చౌర్య | ||||||||||
| దౌర్జన్య దురాచార మాయా కలహ కపట కలుష, అలక్ష్మ్యాది | ||||||||||||||
| ధర్మేతర సమూహంబు లాశ్రయించు. | ||||||||||||||
| 33 | 1401 | 434 | వ్యా | ( నేటి రాజదేహాలలో నున్న కలిని మాత్రం ’ అలక్ష్మి ’ ఒక్కటే ఎందుకో | ||||||||||
| అసలు తాకటమే లేదు. లక్ష్మీతాండవమే { ధనమదం} కనుపిస్తోంది! ) | ||||||||||||||
| ( కలి తాండవ స్థలాలు - పరీక్షిత్తు కలికి ) | ||||||||||||||
| 34 | 1401 | 436 | వ. | (కలి) ” నేనెక్కడ నుందు నానతిమ్మనిన ” , రాజన్యశేఖరుండు: | ||||||||||
| ప్రాణివధ, స్త్రీ, ద్యూత, పానంబు లనియెడి నాలుగు స్థానంబులనిచ్చి, | ||||||||||||||
| మరియు నడిగిన సువర్ణమూలంబగు – అసత్య మద కామ హింసా | ||||||||||||||
| వైరంబు లనియెడు పంచప్రదేశంబుల నొసంగి, | ||||||||||||||
| యితర స్థలముల స్పృశియించకుండ నియమించె! | ||||||||||||||
| 35 | 1401 | 436 | వ్యా | (ధర్మప్రభువైన పరీక్షిత్తు కలిని పైనచెప్పిన 9 స్థలాలను దాటి | ||||||||||
| యివతలకు రావద్దని కట్టడి చేశాడు. మరి నేటి ప్రభువులు | ||||||||||||||
| కలికి సంపూర్ణంగా వశులవటంచేత, కలివిహారానికి | ||||||||||||||
| నిషిద్ధ స్థలాలు అంటూ లేకుండా చేస్తున్నారు! ) | ||||||||||||||
| ( కలిలో ధీరులు ) | ||||||||||||||
| 36 | 1401 | 443 | వ. | మఱియుం, ” ప్రమత్తులై, యధీరులగు నరులయందు ( కలి ) | ||||||||||
| వృకంబు (తోడేలు) చందంబున నొదిగి కాచుకొనియుండి | ||||||||||||||
| చేష్టించుం గాని; ధీరులైన వారికిం గలి వలని భయంబు | ||||||||||||||
| లేద” ని ( పరీక్షిత్తు ) కలి నంతంబు నొందింపడయ్యె. | ||||||||||||||
| cultural G.K | ||||||||||||||
| ( పరీక్షిత్తు ) | ||||||||||||||
| 37 | 1500 | వ | పరీక్షిత్తు అసలు పేరు “విష్ణురాతుడు “ | |||||||||||
| ( విదురుడు ) | ||||||||||||||
| 38 | 1500 | 307 | వ. | మాండవ్యమహాముని శాపంవల్ల యముడు శూద్రకులంలో | ||||||||||
| విదురుడుగా జన్మించాడు. ఆ 100 సం.లు సూర్యుడే | ||||||||||||||
| యమధర్మాలను నిర్వర్తించాడు. | ||||||||||||||
| ( మహర్షి ముఖ్యుల నామాలు ) | ||||||||||||||
| 39 | 1500 | 498 | వ. | ” సకలలోక పావనమూర్తులు మహానుభావులునగుచు | ||||||||||
| దీర్థంబులకుం దీర్థత్వంబు లొసంగ సమర్థులైన | ||||||||||||||
| అత్రి, విశ్వామిత్ర, మైత్రేయ, భృగు, వసిష్ఠ, పరాశర, | ||||||||||||||
| చ్యవన, భరద్వాజ, పరశురామ, దేవల, గౌతమ, కశ్యప, | ||||||||||||||
| కణ్వ, కలశసంభవ ( = అగస్త్య ), వ్యాస, పర్వత, నారద | ||||||||||||||
| ప్రముఖులైన బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి పుంగవులును; | ||||||||||||||
| కాండర్షులయిన యరుణాదులును, మరియును | ||||||||||||||
| నానాగోత్ర సంజాతులైన మునులును, శిష్య ప్రశిష్య | ||||||||||||||
| సమేతులై చనుదెంచిన, ( పరీక్షిత్తు ప్రాయోపవేశానికి | ||||||||||||||
| వీరంతా విచ్చేశారు! ) | ||||||||||||||
| ( విచార ( దైన్య ) హేతువులు ) | ||||||||||||||
| 40 | 1520 | 355 | క. | తప్పితివో యిచ్చెదనని, | ||||||||||
| చెప్పితివో కపటసాక్షి, చేసిన మేలుం; | ||||||||||||||
| దెప్పితివో శరణార్థుల, | ||||||||||||||
| రొప్పితివో ద్విజుల బసుల రోగుల సతులన్ ! | ||||||||||||||
| ( రొప్పితివో = బాణాలు గుప్పించావా ! ) | ||||||||||||||
| 41 | 1520 | 356 | క. | అడిచితివో భూసురులను? | ||||||||||
| గుడిచితివో బాల వృద్ధ గురువులు వెలిగా? | ||||||||||||||
| విడిచితివో యాశ్రితులను? | ||||||||||||||
| ముడిచితివో పరుల విత్తములు లోభమునన్? | ||||||||||||||
| ( ధర్మదేవత 4 పాదాలు ) | ||||||||||||||
| 42 | 1520 | 429 | వ. | ” కృతయుగంబునం దప, శ్శౌచ, దయా, సత్యంబులు ” . | ||||||||||
| ( యుగ కనీస కర్తవ్యాలు ) | ||||||||||||||
| 43 | 1520 | 429 | సార | (కృతయుగంలో – ధర్మం ఈ నాలుగు పాదాలా నడిచింది. | ||||||||||
| త్రేతాయుగంలో – తపస్సు క్షీణించింది | ||||||||||||||
| ద్వాపరయుగంలో – తపస్సు, శౌచములు క్షీణించాయి. | ||||||||||||||
| కలియుగంలో – తప శ్శౌచ దయలు క్షీణించాయి! ) | ||||||||||||||
| ( సత్యాసత్యాలు ) | ||||||||||||||
| 44 | 1520 | 429 | వ్యా | ( కలిలో మిగిలిన ఒక్క పాదం ” సత్యం ” అంటే అర్థం - | ||||||||||
| కలిలో అందరూ సత్యవంతులుగా ఉంటారని కాదు; | ||||||||||||||
| కనీసం ’ సత్యం ’ అనే ఒక్క ధర్మాన్నైనా ఆచరించాలని! | ||||||||||||||
| పరుల హితం కోసం చెప్పే అసత్యమైనా సత్యమే! | ||||||||||||||
| పరులకు కష్టనష్టాలు కలిగించే సత్యమైనా అసత్యమే! | ||||||||||||||
| తన, తనవారి లాభం కోసం చెప్పే అసత్యం పాపమే! ) | ||||||||||||||
| చర్చనీయం | ||||||||||||||
| 45 | 1900 | 514/4 | శా. | సప్తాహంబుల ముక్తికేగెడు గతిం జర్చించి భాషింపరే ! | ||||||||||
| భక్తియోగం | ||||||||||||||
| 46 | 2331 | 65/4 | క. | యుగయుగమున బుట్టి కాచు నుద్యల్లీలన్ . | ||||||||||
| 47 | 2331 | 364/4 | తే. | ఇట్టి త్రైలోక్యసంతర్పి యెందు గలడు ! | ||||||||||
| 48 | 2332 | 451/4 | సీ. | ” భగవంతు ” డనియెడి భద్రశబ్దమునకు | ||||||||||
| నెవ్వడర్థాకృతి నేపు మిగులు ! | ||||||||||||||
| ( ఆర్త ప్రార్థన – పరీక్షిత్తు , తల్లి గర్భం లోనుంచే ) | ||||||||||||||
| 49 | 2336 | 283 | శా. | రాడా! చూడ, సమస్త భూతములలో రాజిల్లువాడిచ్చటన్ | ||||||||||
| లేడా! పాఱుని చిచ్చరమ్ము దొలగన్ లీలాగతిం ద్రోచి నా | ||||||||||||||
| కీడా! నేడభయప్రదాన, మత డూహింపన్ నతత్రాత మున్ | ||||||||||||||
| గాడా! యెందఱి గావడీ యెడల, మత్కర్మంబు దానెట్టిదో ! | ||||||||||||||
| ************************************** | ||||||||||||||
| ( 1వ స్కంధం సారపరిశీలనం సంపూర్ణం. ) | ||||||||||||||