| |
|
| |
|
| బ్రహ్మాండమైన తపస్సుచేసికూడ, వరాలు అడిగేటప్పుడు ఉచ్చారణాదోషాలవల్ల |
|
|
| ఆశించిన ఫలితాలు పొందలేకపోయిన మహా రాక్షసుల గురించి మనం విన్నాం. |
|
|
| సరియైన ఉచ్చారణతో శబ్దశక్తినీ, అర్థశక్తినీ కూడ సంపూర్ణంగా పొంది, లబ్ధిపొందగలము. |
|
|
| ఉదాహరణకు : |
|
|
|
| నూతన దంపతులను గానీ, వివాహిత స్త్రీలను గానీ ఆశీర్వదించేటప్పుడు, |
|
|
| ఒక్క దీర్ఘం ఎంత విపరీతార్థాన్ని ఇస్తుందో చూడండి. |
|
|
|
|
| (ఒప్పు )”శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు” – అంటే- త్వరలోనే సుపుత్రుడు కలుగు గాక! |
|
|
| (తప్పు ) “శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు” అంటే - ”సుపుత్ర + అప్రాప్తిరస్తు” అనగా |
|
|
| త్వరలోనే సుపుత్రుడు కలుగకుండు గాక! ఎంతటి అనర్థం! |
|
|
|
|
|
|
| చక్కగా సంస్కరింపబడిన భాషకు ఒక ముఖ్య లక్షణం : |
|
|
| వ్రాసినదానిని బట్టి చదివితే, ఆ పదం సరిగా ఉచ్చరింపబడాలి; |
|
|
| ఎవరు చదివినా ఒకేరకంగాఉచ్చరింపబడాలి. నాకు తెలిసిన వాటిలో |
|
|
| ఆ సౌలభ్యం సంస్స్కృతానికీ, తెలుగుకూ, హిందీకీ ఉన్నది; ఇంగ్లీషుకూ, తమిళానికీ లేదు. |
|
|
| అయినా తెలుగు ఉచ్చారణలో దోషాలు దొర్లుతూనే ఉన్నాయి! |
|
|
| ముఖ్యమైన కారణం – పాఠశాలలలో నలభైమందిమీద చెప్పుకుపోతూ ఉండటమేగాని, |
|
|
| వ్యక్తిగత దోషాలను సరిచేసే సమయం, అవకాశం ఉండవు గదా. |
|
|
| వ్యక్తిగత శ్రద్ధ ( individual attention ) అనేది తప్పనిసరిగా |
|
|
| తల్లిదండ్రుల ( వారి తల్లిదండ్రుల ) నుంచే రావలసి ఉంటుంది. |
|
|
|
|
| పిల్లలయొక్క వాచాదోషాలను సరిచేయాలనిఉన్నా, సాధారణంగా వచ్చే దోషాలు, |
|
|
| ఏది తప్పు, ఏది ఒప్పు అనేది తెలియటం అవసరం కదా ! |
|
|
| తల్లిదండ్రులకూ, ఉపాధ్యాయులకూ సౌకర్యంగా ఉండేందుకు మా దృష్టికి వచ్చిన పదాలను |
|
|
| అప్పుడప్పుడూ ఇదే పేజీలో పొందుపరుస్తూ ఉంటాము. |
|
|
|
|
| ఔత్సాహిక మిత్రులుకూడ అట్టి పదాలను ఈ పేజీక్రింద, వారి వ్యాఖ్యల( comments) ద్వారా |
|
|
| అందించ ప్రార్థన ! మొదటగా, భారతీయులలో 80% మందికి పైగా రోజూ చదివే |
|
|
| గురుప్రార్థనా శ్లోకం ” గురుర్బ్రహ్మా…” లో పరిశీలిద్దాము. |
|
|
|
|
| ఒప్పు |
తప్పు |
|
|
| గురుర్‍బ్రహ్మా |
గురుబ్రహ్మ ( బ్రహ్మా=సృష్టికర్త, త్రిమూర్తులలో ఒకరు) |
|
|
| గురుర్విష్ణు: |
గురువిష్ణుః |
|
|
| గురుర్దేవో |
గురుదేవో (గురుః + దేవో = గురుర్దేవో) |
|
|
| మహేశ్వరః |
…….. |
|
|
| గురుస్సాక్షాత్ |
గురుసాక్షాత్ (గురుః + సాక్షాత్ = గురుస్సాక్షాత్. |
|
|
| పరంబ్రహ్మ |
పరబ్రహ్మా (బ్రహ్మ=త్రిమూర్తులకు మూలమైన పరమాత్మ) |
|
|
| తస్మై శ్రీ |
………… |
|
|
| గురవే నమః |
గురువే న్నమః (‘న’ క్రింద ’ న ‘వత్తు ఉండరాదు) |
| |
|
| * * * * * * * * * * * * * |
|
| |
|
| |
|
| |
|
| |
|
| |
|
| |
|
| |
|
| |
|
| |
|
| |
|