(02) ’తపన’ గురించి

     స్వాగతం !

  • మనం ముందు “భారతీయులం”, తరువాతే “ఆంధ్రులం”
  • భారతీయుల, ప్రత్యేకించి ఆంధ్రుల జీవితాలలో పలు రంగాలలో వస్తున్న మార్పులు, విలువల పతనం (value degradation) మనలో చాలా మందికి “తపన” కలిగిస్తూనే ఉన్నాయి.
  • విలువల పరిరక్షణ అనేది దేశం కోసమో ఎవరి కోసమో కాదు. పాటించే వారి సుఖసంతోషాలు, ఆత్మ గౌరవం పెరగ డానికే !
  • మన తపన గురించి సాటి వారితో పంచుకోవాలనే తపనే ఈ ప్రయత్నం !
  • ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే !
  • సద్విమర్శయే కాకుండా పరిష్కారానికై మనకు తోచిన సూచనలు కూడా చేద్దాం.
  • మనలో చాలామంది యువకులు, ఉత్సాహ వంతులు, కార్యశూరులు ఉన్నారు. తమ అభిమాన రంగాలలో వచ్చిన నచ్చిన సూచనలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తూ, ఫలితాలు నలుగురికీ తెలియ జేద్దాం.
  • ఏ రంగమైనా మంచిదే. కొన్ని ప్రాధాన్యతా రంగాలు : ఆహారం, ఆరోగ్యం, వైద్యం, ప్రాథమిక విద్య, సంస్కృతీ స్థూల అవగాహన, విశాల దృక్పథం, మానవతా వాదం, కుటుంబానందం, మాతృదేశాభిమానం, మాతృభాషా సంస్కృతీ సాహిత్యాలు, స్త్రీల మనోభావాలు, విద్యా వైద్య రాజకీయ రంగాలలోని భ్రష్ట వ్యాపార ధోరణులు, వ్యాపార ప్రకటనల లోని తప్పుడు సూచనలు,…
  • కాదేదీ  ” తపన ” కనర్హం !      

ప్రత్యుత్తరమిమ్ము